ఈ టైంలో నీళ్లు తాగండి..ఆరోగ్యంగా ఉండండి!

27
- Advertisement -

నేటి రోజుల్లో శారీరక శ్రమ చాలా అవసరం. శారీరక శ్రమ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. ముఖ్యంగా కూర్చొని పని చేసే వారు రోజు వ్యాయామం లేదా యోగా తప్పనిసరి. లేదంటే అనారోగ్యం బారిన పడతాం. అయితే రోజు ఓ పద్దతి ప్రకారం నీరు తాగడం వల్ల కొంతైనా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం..

మనం మంచి నీళ్ళు ఎప్పుడు, ఎంత, ఎలా , ఏ విధముగా త్రాగాలి? రోగం వచ్చాక చికిత్సకంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము. అందుకే ఆరోగ్య సూత్రాలను పాటించడం తప్పనిసరి.ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీరు తాగితే శరీరంలోని అవయవాలు శుభ్రమవుతాయి. ఇక అన్నం తినే ముందు ఒక గ్లాన్ నీరు తాగితే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది.స్నానం చేసే ముందు ఒక గ్లాస్ నీరు తాగితే లో బ్లడ్ ప్రెషర్ నుండి బయటపడవచ్చు. ఇక రాత్రి పడుకునే ముందు ఒక గ్లాన్ నీరు తాగితే డీ హైడ్రేషన్ నుండి బయటపడవచ్చు.

Also Read:నేచురల్ యాంటి బయోటిక్స్..

బ్రేక్ ఫాస్ట్ లేక భోజనం చేసిన గంటన్నర తరువాత నీళ్లు త్రాగాలి. ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు ఆగి ప్రదీప్తమై ఉంటుంది. అప్పుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది‌. ఇక నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిలబడి త్రాగితే ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వలన అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే.. ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

Also Read:విషపు పుట్టగొడుగులను గుర్తించడమెలా?

- Advertisement -