ఈ రోజు మూడు సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి. విభిన్న కథలతో ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు విజయ్ ఆంటోని. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘బిచ్చగాడు 2’ భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఆయన నుంచి మరో సినిమా రావడానికి సిద్ధమైంది. ఆ చిత్రమే ‘హత్య’. కొంతసేపటి క్రితమే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జులై 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర పోస్టర్ ను వదిలారు. దీనిలో విజయ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాంఢీవధారి అర్జున’ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మిక్కీ జే మెయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించింది.
Also Read: కాజోల్ లస్ట్ కామెంట్స్ వెనుక కథ అదే
తమిళ హీరో ధనుష ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 30న కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Neenagupta:కిస్ సీన్ చేశాక డెటాల్‌తో శుభ్రం..!