టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ట్యాక్సీవాలా. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ పొందింది. అయితే గత చిత్రాల మాదిరిగానే విజయ్ ట్యాక్సావాలా పైరసీకి గురైంది. దీనిపై స్పందించారు విజయ్ దేవరకొండ.
ఆసక్తికరమైన స్క్రిప్ట్. మంచి యువకులున్న బృందం. అద్భుతమైన గ్రాఫిక్స్. కొన్నేళ్ల కష్టం, ఒత్తిడి. ఇంత చేస్తే సినిమా మొత్తాన్ని లీక్ చేసేశారు. దీనిపై ఓ క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో అని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఓ వీడియో లింక్‌ను పోస్ట్ చేశారు.
రాహుల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన ప్రియాంక జువాల్కర్ కథానాయిక. ఇందులో విజయ్ ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో కన్పించనున్నారు. గతంలో విజయ్ నటించిన గీతగోవిందం కూడా పైరసీ పాలైన సంగతి తెలిసిందే. విడుదలకు రెండు రోజుల ముందు ఆన్లైన్లో లీక్ అయింది. తాజాగా ట్యాక్సీవాలా కూడా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ అవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు విజయ్.