ది రానా.. దగ్గుబాటి షో

2
- Advertisement -

స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి నిర్మించి, క్రియేట్ చేసి, హోస్ట్ చేస్తున్న ఈ సరికొత్త అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ సిరీస్‌, ఎనిమిది ఎపిసోడ్ల కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొని, రానాతో అన్ ఫిల్టర్డ్ సంభాషణలు, ఎక్సయిటింగ్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు.ఈ షోలో దుల్కర్ సల్మాన్, నాగచైతన్య అక్కినేని, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు పాల్గొంటారు.నవంబర్ 23 నుంఛి ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో ప్రసారం కానున్న ఈ షోలో ప్రతి శనివారం ఒక కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది.

ముంబై, ఇండియా—నవంబర్ 13, 2024—భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ డెస్టినేషన్ ప్రైమ్ వీడియో తన మొదటి టాక్ షో – ది రానా దగ్గుబాటి షో – నవంబర్ 23 నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది. రానా దగ్గుబాటి స్వయంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ హోస్ట్ చేస్తున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ సిరీస్‌లో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొంటారు. దుల్కర్ సల్మాన్, నాగచైతన్య,నానీ, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి అనేక మంది ప్రత్యేక అతిథులు ఇందులో ఉంటారు. సన్నిహిత సంభాషణలు, సరదా చలోక్తులతో సాగే ఈ సిరీస్ ద్వారా వారు తెలియని కోణాలను రానా ఆవిష్కరిస్తారు. భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో నవంబర్‌ 23 నుంచి ది రానా దగ్గుబాటి షో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా విడుదల కానుంది. ప్రతీ శనివారం కొత్త ఎపిసోడ్‌ ఆస్వాదించవచ్చు.

ఫిల్టర్‌ చేయని సంభాషణలు, సెలబ్రిటీల గురించి తెలియని కోణాలతో సెలబ్రటీ టాక్‌ షోకు కొత్తదనాన్ని తీసుకురానుంది ది రానా దగ్గుబాటి షో. తనతో పాటు తన అతిధుల్లోని సరదా కోణాన్ని బహిర్గతం చేయనున్న రానా, వెండితెరకు ఆవల వారి ఫన్ యాక్టివిటీస్, వారి పాషనేట్ హాబీస్, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఫ్యాన్స్‌కు తెలియని, ఈ ప్రపంచం వినని విషయాలు ఈ షో ద్వారా తెలియజేయనున్నారు.

ఎక్స్ ట్రార్డినరీ గా ఉండే ది రానా దగ్గుబాటి షోలో మైమరపింపజేసే సంభాషణలు, ఆకట్టుకునే యాక్టివిటీస్ తో రానానే కాదు ఈ షోకు వచ్చే ఆయన ఆతిధులు కూడా పూర్తిగా లీనమైపోతారు. పరిశ్రమలో కొందరు ప్రముఖ వ్యక్తుల గురించిన ఎవరికీ తెలియని విషయాలు ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తాయి. అతిధులు తమ సంకోచాలు విడిచిపెట్టి అభిమానులతో పూర్తిగా కనెక్ట్‌ అయ్యే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ షోలో రానా సృష్టిస్తారు” అని తెలిపారు ప్రైమ్‌ వీడియో ఇండియా ఒరిజినల్స్‌ హెడ్‌ నిఖిల్ మధోక్‌ అన్నారు. “సెలబ్రిటీల వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక ప్రత్యేక కోణాన్ని ది రానా దగ్గుబాటి షో చూపుతుంది. ఇలాంటి కార్యక్రమం ద్వారా విశిష్ఠ అతిధులు, వారి అభిమానుల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు అతిధి సత్కారాల్లో ట్యాలెంటెడ్ రానా దగ్గుబాటిని మించి ఇంకా ఎవరు ఉంటారు. సక్సెస్ ఫుల్ ‘దూత’ ను ఆధారంగా చేసుకొని తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన కంటెంట్‌ అందించేందుకు ప్రైమ్‌ వీడియో కట్టుబడి ఉంది. ఈ షో ద్వారా కొత్త జొనర్‌ కంటెంట్‌తో ఆకట్టుకునే, కట్టిపడేసే వినోదాన్ని అందిస్తున్నందుకు మాకు చాలా ఉత్సాహంగా ఉంది” అన్నారు.

Also Read:‘కుబేర’.. ఫస్ట్ గ్లింప్స్

ఈ షో హోస్ట్‌, క్రియేటర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రానా దగ్గుబాటి మాట్లాడుతూ, “నచ్చిన సెలబ్రిటీల గురించి తెలుసుకునేందుకు చాలా కాలంగా టాక్‌ షోస్‌ అలరిస్తున్నాయి. కాని, మేము ఆ స్క్రిప్ట్ తిరగరాస్తున్నాం. ఆ స్టార్స్‌ నిజజీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు మా షో ఒక బ్యాక్‌ స్టే పాస్‌లాంటింది. వీరిలో చాలా మంది నా స్నేహితులు, కలీగ్స్‌ ఉన్నారు. హాయిగా ఉండండి, ఎటువంటి ఫిల్టర్స్ వుండవు, ఊహించని విషయాలు ఎన్నో బయటపడతాయి. మీరు మెచ్చిన ఐకాన్స్‌ టీ తాగుతూ, వారు చెప్పే విషయాలు మిమ్మల్ని అలరిస్తాయి. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నవంబర్‌ 23 నుంచి ప్రైమ్‌ వీడియోలో మొదలయ్యే ఈ షో 240కి పైగా ఉన్న దేశాల్లోని ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఆ సంతోషాలు, సరదాలు, మీ ఫ్రెండ్స్‌కు టెక్ట్సింగ్‌ చేసే క్షణాలకు సిద్ధమైపోండి, ఎందుకంటే ఇది నిజం, దగ్గర నుంచి చూసే అవకాశం” అన్నారు.

- Advertisement -