ది రాజా సాబ్..ఫస్ట్ సింగిల్

6
- Advertisement -

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది రాజా సాబ్. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ అందరిని ఆకట్టుకోగా తాజాగా ఫస్ట్ సింగిల్ డేట్ ఖరారైంది. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు.

హారర్-కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నారు.

అక్టోబర్ చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుంది. తర్వాత పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషన్లు మొదలవుతాయి. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read:మిరాయ్‌..గూస్‌బంప్స్ గ్యారెంటీ!

- Advertisement -