ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బలమైన నోట్‌తో ప్రారంభమయ్యాయి. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 17,500కు పైగా టికెట్లు అమ్ముడుపోగా, యూకే మార్కెట్‌లో కూడా 17,500కిపైగా టికెట్లు ప్రీ-సేల్స్‌లో నమోదయ్యాయి. ఈ ఉత్సాహభరితమైన గణాంకాలు, జనవరి 8, 2026 నుంచి ప్రారంభమయ్యే ప్రీమియర్ షోల ముందు సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కనుందనే సంకేతాలు ఇస్తున్నాయి.
ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహాయక పాత్రల్లో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరినా వహాబ్, సప్తగిరి, వి టి వి గణేష్ తదితరులు కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.
Also Read:మోడీ అంటే ఇష్టం అంటూనే..భారత్‌కు ట్రంప్ హెచ్చరిక!

