OTT:ది రాజా సాబ్‌..ఓటీటీ రైట్స్‌!

8
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రెండో సింగిల్‌ను కూడా త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

తాజా రిపోర్ట్స్ ప్రకారం, సినిమా విడుదలకు నెలరోజులు ముందుగానే ది రాజా సాబ్ ఓటీటీ డీల్ పూర్తయిందట. ఈ భారీ చిత్రానికి పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:KTR:సమసమాజ స్వాప్నికుడు..అంబేద్కర్

- Advertisement -