- Advertisement -
96 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్ -2 ఈనెల 8న తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన రాణిగా నిలిచిన ఆమె నిన్న మృతిచెందగా కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 11న సంతాప దినంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆమె మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని సగం వరకు కిందకు దించాలని ఆదేశించారు. ఆదివారం ఎలాంటి అధికారిక వేడుకలు నిర్వహించకూడదని వెల్లడించారు.
ఇక బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరవుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు.
- Advertisement -