- Advertisement -
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో స్థిరంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ రోజు ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతుందన్ని తెలిపింది. దీంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ వైపు వర్షాలు పడుతుంటే మరోవైపు ఐదు రోజుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41డిగ్రీల నుంచి 43డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో వడగాలులు వీచే అవకాశముందని నాగరత్న తెలిపింది.
Also Read: చేతివృత్తులకు భరోసా..లక్ష ఆర్థిక సాయం
- Advertisement -