ఏపీ నుండి కేంద్రమంత్రులు వీరేనా?

14
- Advertisement -

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7.15 గంటలకు పీఎంగా మోడీ ప్రమాణస్వీకారం చేయనుండగా ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇక ఈ సారి కేంద్రకేబినెట్‌లో 5గురికి అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే జేడీయూ, లోక్ జన శక్తి, జనసేన, జేడీఎస్ లాంటి పార్టీలో కీలకంగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు కొంత ఆసక్తి రేపుతోంది.

ఏపీలో కూటమి తరపున 21 మంది గెలవగా టీడీపీ 16,జనసేన 2,బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. జనసేనకు 1,బీజేపీకి 1,టీడీపీకి 3 కేంద్రమంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. టీడీపీ తరపున కింజరాపు రామ్మోహన్ నాయుడు,దగ్గుమళ్ల ప్రసాదరావు,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,పెమ్మసాని చంద్రశేఖర్,లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్లు వినిపిస్తుండగా జనసేన నుండి బాలశౌరికి దక్కు అవకాశం ఉంది. ఇక బీజేపీ నుండి ప్రధానంగా పురందేశ్వరి, సీఎం రమేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -