తమిళ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మహానాయకురాలు అమ్మ జయలలిత.ఎంజీఆర్,కరుణానిధి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న జయ…అమ్మగా ప్రజల్లో చెరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింతగా చేరువైన జయలలిత దశాబ్దాల పాటు తమిళరాజకీయాలను శాసించింది.
ఈ నేపథ్యంలో అమ్మ జయలలిత జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం కాగాదర్శకురాలు ప్రియదర్శని ది ఐరన్ లేడీగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది.
జయలలిత వర్థంతి(డిసెంబర్ 5,2016) సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో నిత్యామీనన్ అచ్చం జయలలిత లుక్‌లో కనిపిస్తుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.
మరో వైపు తమిళ దర్శకుడు భారతీరాజా.. జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్‌ని కానీ… అనుష్కను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు భారతీ రాజా ప్రయత్నిస్తున్నారు.