సినీ ఫక్కీలో బాబాను తప్పించేందుకు కుట్ర !

225
The Great Escape Plan of Dera Chief Gurmeet Ram Rahim
The Great Escape Plan of Dera Chief Gurmeet Ram Rahim
- Advertisement -

గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబా రోహ్ తక్ లోని జైల్లోనే ఉంచి.. అక్కడే తీర్పును ఇచ్చారు. కొన్ని వేల మంది సైన్యం జైలు చుట్టూ పహారా కాస్తోంది. జైలుకు 10 కిలోమీటర్లకు దగ్గరగా సామాన్యులకు అనుమతి లేదు. శుక్రవారం నాడు కోర్టు రామ్ రహీం సింగ్ ను దోషిగా తెల్చినప్పుడు డేరా సచ్చా సౌదా కార్యకర్తలు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఇప్పటిదాకా 38 మంది మరణించారు.. అలాగే 200 మందికి పైగా గాయపడ్డారు. పోలీసుల అదుపులో ఉన్న బాబాను తప్పించేందుకు బాబా అనుచరులు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. చివరకు గుర్మీత్‌ను సినీ ఫక్కీలో తప్పించేందుకు కూడా ప్లాన్ చేసి దొరికిపోయారు.

2017_6$largeimg15_Thursday_2017_011328667

వివరాళ్లోకి వెళితే.. గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్ ను తప్పించేందుకు డేరా అనుచరులు పథకం సిద్దం చేశారని హర్యాణా పోలీసులు సంచలన విషయం వెల్లడించారు. కోర్టు హాల్ నుంచి జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గుర్మీత్‌ను స్కార్పియోలో ఎక్కించారు. ఆయన రెండు వైపులా గార్డులు కూర్చున్నారు. అప్పటికే జైలు చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసిన పికెట్ ను దాటాల్సి ఉంది.

ఆ పికెట్‌ను టార్గెట్ చేసుకున్న గుర్మీత్ అనుచరులు.. అక్కడే వేచి ఉన్నారు. పోలీసుల స్కార్పియో పికెట్ ను చేరుకునేలోపు తమ కారుతో అడ్డగించి, బాబాను అడ్డగించాలని కేకలు వేశారు. దీంతో స్కార్పియో నుంచి ఆరుగురు పోలీసు అధికారులు తుపాకులతో బయటకు దిగారు. సినిమా ఫక్కీలో తమ కారుతో పోలీసుల కారుని గుద్దించి బాబాను ఎత్తుకుపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలోనే పోలీస్ పికెట్ నుంచి మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కథ అడ్డం తిరిగింది. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నింటితో హర్యాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో గుర్మీత్ రాం రహీం సింగ్ కు మరిన్ని తిప్పలు తప్పేలాలేవు.

- Advertisement -