ది ఘోస్ట్ రన్‌టైం ఎంతో తెలుసా?

180
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాను చిత్ర యూనిట్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. సెన్సార్ పనులు ముగించుకోగా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 135 నిమిషాలుగా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

భరత్ సౌరభ్, మార్క్ కె రాబిన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -