ది ఘోస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్

115
the ghhost
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్ లో ది ఘోస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక సూపర్ సక్సెస్ అయ్యింది.

నాగార్జున మాట్లాడుతూ ఈ రోజు ఈ వేదిక పై నేను, చైతు, అఖిల్ ఇంత ప్రేమని అభిమానాన్ని అందుకుంటున్నామంటే.. దానికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలపాలి. తెలుగు సినీ పరిశ్రమ, మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు. మీ ప్రేమ అభిమానం చూడటానికే చైతు, అఖిల్ ని ఇక్కడికి రమ్మన్నాను. 33 ఏళ్ల కిందట అక్టోబరు 5న ‘శివ’ అనే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పుడు చైన్ పట్టుకుని వచ్చాను. అదే అక్టోబరు 5న కత్తి పట్టుకుని వస్తున్నాను. ది ఘోస్ట్ కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. విజయదశమి అందరికీ విజయాన్నిస్తుందని అంటారు. ఈ పండగ మాకు కూడా విజయాన్నిస్తుందని నమ్ముతున్నా. మీ అందరికీ నచ్చి మెచ్చుతారని అనుకుంటున్నాను.‘ది ఘోస్ట్’ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి యాక్షన్, డ్రామా అంటే ఇష్టం. ఆ రెండింటినీ కలిపి ఈ సినిమా తీశారు.

శివ సమయంలో సౌండ్స్ గురించి మాట్లాడారు. ది ఘోస్ట్ లో ఎఫెక్ట్స్, మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. నేను చాలా సినిమాల్లో గన్స్ వాడాను. కానీ ఈ సినిమా కోసం నాతో పాటు హీరోయిన్ సోనాల్ కి కూడా పదిహేను రోజుల పాటు మిలటరీ ట్రైనింగ్ ఇప్పించారు ప్రవీణ్ సత్తార్. సోనాల్ కాలు కూడా ఇరిగింది. ఈ ఏడాది ఆరంభంలో నాగచైతన్యతో కలిసి ‘బంగార్రాజు’తో ప్రేక్షకుల ముందుకొచ్చా. అది థియేటర్లలో ఎంతగానో ఆదరణ పొందింది. ఓటీటీ, టెలివిజన్లలో రికార్డులు సృష్టించింది. దానికి వచ్చిన టీఆర్పీ ఈ ఏడాది ఏ సినిమాకీ రాలేదు. త్వరలో అఖిల్ తో కలిసి నటిస్తున్నా. ‘అన్నమయ్య’ సినిమా సమయంలో కర్నూలుకి వచ్చాను. నరసింహ స్వామికి దండం పెట్టుకున్నాను. బసవన్న ముందు డ్యాన్స్ చేశాను. మళ్లీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది. ఘోస్ట్ అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది. నన్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో ‘ది ఘోస్ట్’లో అలాగే కనిపిస్తా. నేను యాక్షన్ సినిమా చేసి చాలా రోజులైయింది. చాలా కష్టపడి చేశాం. ప్రేక్షకులంతా చూసి ఆదరిస్తారనే గొప్ప నమ్మకంతో ఉన్నాం. నాకెంతో ఆప్తులైన చిరంజీవి సినిమా కూడా విజయదశమికి విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ నాన్నతో, అఖిల్ తో కలిసి అభిమానుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఒక మాస్ సినిమా మీకు నచ్చినట్లు పడితే సౌండ్ ఏమిటో మాకు హైదరాబాద్ లో తెలుస్తుంది. ఆ సౌండ్ ఏంటో ఈ రోజు నాకు కొంచెం రుచి దొరికింది. అభిమానులందరికీ కృతజ్ఞతలు. వారంలో మూడు నాలుగుసార్లు నాన్నని కలుస్తూ ఉంటాను. ఆయన ఐదు, పది నిమిషాలు తన పని గురించి మాట్లాడుతుంటారు. గత నాలుగైదు నెలలుగా ఎప్పుడు కలిసినా ది ఘోస్ట్ సినిమా గురించే మాట్లాడారు. ఒక సినిమా గురించి ఇలాంటి ఎక్సయిట్మెంట్ నాన్నలో చూసి చాలా రోజులైంది. ఘోస్ట్ కంటెంట్ చూసి బ్లాంక్ అయిపోయాను. బంగార్రాజు నుండి ఘోస్ట్ ట్రాన్స్ ఫర్మేషన్ రియల్లీ అమేజింగ్. నాన్నని చూస్తుంటే ఎంతో స్ఫూర్తి కలుగుతుంటుంది. నాన్నని స్టైలిష్, యాక్షన్ సినిమాలో చూడటానికి నేను ఇష్టపడతాను. అలాంటి సినిమానే తీశారు ప్రవీణ్ సత్తారు. ప్రవీణ్ కట్ చేసిన ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ వుంది. అది నాకు చాలా నచ్చింది. ప్రవీణ్ గరుడవేగ యాక్షన్ అంటే నాకు ఇష్టం. ఆయనకి నా బెస్ట్ విషెస్. సునీల్ నారంగ్ , పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నాకు ఇష్టమైన నిర్మాతలు. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అక్టోబర్ 5 అభిమానులకు పండగ. థియేటర్లో కలుద్దాం” అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ నాన్నని ఎలా చూడాలనుకుంటున్నానో అలానే చూస్తున్నా. నేను కోరుకున్నట్ల నాన్నని ఇంటెన్స్సిటీ, ఫైర్ తో చూపించిన దర్శకుడు ప్రవీణ్ కి థాంక్స్. నాన్నకి సినిమాపై ప్యాషన్, ఆకలి తగ్గదా అని నేను, అన్నయ్య మాట్లాడుకున్నాం. 30 ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో పనిచేస్తున్నారాయన. మాకు ధైర్యం, స్ఫూర్తి మా ఇంట్లోనే ఉందని అర్థమైంది. మేం ఎంత పరిగెత్తాలో నాన్న చూపిస్తున్నారు. ది ఘోస్ట్ లో ఒక ఫైర్ ఇంటన్సిటీ వుంది. అక్టోబర్ 5న మనం చూడబోతున్నాం. సినిమా యూనిట్ అంతటి కృతజ్ఞతలు. మీ కష్టం కనిపిస్తుంది. ప్రేక్షకులంతా సినిమాని ఎంజాయ్ చేస్తారానే గట్టిగా నమ్మకం వుంది అన్నారు.

ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ నాగార్జునని డైరెక్ట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను . అందరీ అంచనాల్ని అందుకునేలా ది ఘోస్ట్ వుంటుంది. నాగార్జునని ఎలా చూసి పెరిగానో అలాంటి ఇంటెన్స్ లుక్స్ తో ఆయన్ని తెరపై చూపించాను. చిత్రబృందం చక్కటి సహకారం అందించింది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గొప్ప సపోర్ట్ అందించారు. డీవోపీ ముకేష్ , ఎడిటర్ ధర్మేధ్ర, సివి రావు, మోహన్, భరత్, సౌరభ్, మార్క్ కె.రాబిన్ మిగతా టీం అందరికీ థాంక్స్. అక్టోబర్ 5న అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ..నాగార్జునతో కలసి పని చేయడం గొప్ప అనుభవం. ట్రైలర్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అక్టోబర్ 5న బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులు ఇంతకంటే ఎక్కువ ఎక్సయిట్ ఫీలౌతారు. ఘోస్ట్ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నా కెరీర్ ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి. నాకు ఇష్టమైన యాక్షన్ రోల్ ఇది. నన్ను నమ్మి ప్రియ పాత్ర ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కి థాంక్స్. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ కి కృతజ్ఞతలు. ది ఘోస్ట్ గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అక్టోబర్ 5న అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి అని కోరారు.

శరత్ మరార్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి వచ్చిన నాగచైతన్య, అఖిల్ కి థాంక్స్. నాగార్జున, చైతు, అఖిల్ ముగ్గురూ వేదికపై కలిసివస్తున్నప్పుడు చూడటం కన్నుల పండగలా వుంది. ది ఘోస్ట్ చిత్రానికి నిర్మాతలు కావడం ఆనందంగా వుంది. ఇంత చక్కటి స్లీక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసిన క్రిడెట్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి దక్కుతుంది. నాగార్జున ఈ చిత్రానికి మొదటి నుండి గొప్ప సపోర్ట్ అందించారు. ప్రవీణ్ సత్తారు గొప్ప టీంని ఎంపిక చేసుకున్నారు. సోనాల్ చౌహాన్ చాలా అంకితభావంతో పెర్ఫార్మ్ చేశారు. అక్టోబర్ 5న సినిమా వస్తోంది. మీ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అన్నారు

పుస్కుర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ.. నాగార్జున ఎంత స్టయిలీష్ గా స్లీక్ గా వుంటారో అంతే స్టయిలీష్ గా ఈ సినిమాని తీశాం. ప్రవీణ్ సత్తారు స్టయిలీష్ ఫిల్మ్ మేకింగ్ ఇందులో కనిపిస్తుంది. డీవోపీ ముకేష్ , ఎడిటర్ ధర్మేధ్ర, భరత్, సౌరభ్, మార్క్ కె.రాబిన్. టీం అందరికీ థాంక్స్. అక్టోబర్ 5న సినిమా విడుదలౌతుంది. థియేటర్లో చూసి ఆనందించాలి అని కోరారు.

మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె.రాబిన్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుండి నాగార్జున అంటే ఇష్టం. శివ, గీతాంజలి చిత్రాలు నా ఫేవరేట్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన సినిమాకి పని చేయాలని అనుకున్నాను. ప్రవీణ్ సత్తార్ పిలిచి ఈ సినిమా గురించి చెప్పడంతో నా కల నెరవేరినట్లయింది అన్నారు.

ఈ వేడుకలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్తోపాటు చిత్రబృందం కృష్ణ మాదినేని, విక్రమాదిత్య, ముఖేష్, ధర్మేంద్ర, బ్రహ్మ కడలి, సీవీ రావు, భరత్, సౌరభ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -