రాష్ట్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక:కేసీఆర్

260
The budget for all sections says KCR
- Advertisement -

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా అమలు చేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించారని కొనియాడారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు,అవసరాలు,ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య పూర్తి సమన్వయం కుదురుస్తు బడ్జెట్ రూపొందించారని సీఎం ప్రశంసించారు.

మంత్రి ఈటెల రాజేందర్,ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు,ఆర్ధిక సలహాదారు జీఆర్‌ రెడ్డి పూర్తి సమతుల్యంతో బడ్జెట్‌ ప్రతిపాదించారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు,విద్యుత్ సబ్సిడీలకు ఎక్కువ నిధులు సమకూర్చడం ద్వారా వ్యవసాయ రంగం విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు. రైతులకు బడ్జెట్‌లో పెద్దపీట వేశామన్నారు.

సామాన్యులకు పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు చేనేత,హ్యాండ్లూమ్ కార్మికులకు ప్రాధాన్యత లభించిందన్నారు. రైతులకు రూ. 5లక్షల భీమా పథకంతో పాటు 50-90 శాతం సబ్సిడీతో పరికరాలు అందించేలా బడ్జెట్ రూపొందించారన్నారు.

The budget for all sections says KCR

- Advertisement -