చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇటు టాలీవుడ్‌లోనూ అటు బాలీవుడ్‌లోనూ వరుస బయోపిక్‌లు చేస్తూ దర్శకులతో పాటు నటీనటులు బిజీ అయిపోయారు. తాజాగా అదే కోవకు చెందని మరో బయోపిక్ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మన్మోహన్‌గా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. బొహ్ర బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సజ్జన్ బెర్నర్ట్ సోనియా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలై, ప్రేక్షక ఆదరణ దక్కించుకుంది.
అయితే.. మూవీ షూటింగ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుపుతూ సెట్‌లో తీసిన ఓ వీడియోసు తన ఇస్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” చిత్రం అద్బుతమైన సినిమా అని.. మొత్తం మూవీ యూనిట్‌కు ధన్యవాదాలు అని అనుపమ్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ జీవిత ప్రయాణం తనకు ఎన్నో నేర్పించిదని.. ఈ సినిమాకి ముందు తనలో కొన్ని ఆలోచనలు ఉండేవన్నారు.
దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెప్తున్నానని.. చరిత్ర మిమ్మల్నీ ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి అనుపమ్ పేర్కొన్నారు. మీరు మా సినిమా చూసిన అనంతరం మీతో కలిసి ఓ టీ తాగాలని ఉందని అనుపమ్ ఇస్టాగ్రాంలో కోరారు.
ఇదిలా ఉంటే.. అనుపమ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. మన్మోహన్, సోనియా గాంధీ పాత్రల్లో ఒదిగిపోయారని సినీ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Anupam Kher wraps up the shoot of The Accidental Prime Minister, says he ‘wrongly judged’ the former PM https://t.co/bP6hpf97HJ via @IndianExpress
— Anupam Kher (@AnupamPKher) October 27, 2018