ప్రజా సమస్యలపై వేగంగా స్పందించే నాయకుడిగా మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంధుల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక చేసిన ఒక వినతికి గంటల వ్యవధిలోనే పరిష్కారం చూపించి ప్రశంసలు అందుకున్నారు.
తన స్వగ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహాయం చేయాలని దీపిక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరారు. మధ్యాహ్నం సమయంలో ఆమె చేసిన ఈ విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకున్న పవన్, వెంటనే అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టారు.
దీని ఫలితంగా అదే రోజు సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. హేమావతి నుంచి తంబాలహట్టి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు మొత్తం రూ.3.20 కోట్ల నిధులు విడుదల చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. దీపిక స్వగ్రామమైన మడకశిర నియోజకవర్గంలోని తంబాలహట్టికి ఈ రోడ్డు ఎంతో కీలకమని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేకంగా దివ్యాంగుల సమస్యలపై పవన్ కల్యాణ్ చూపిస్తున్న స్పందన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటలకే పరిమితం కాకుండా, సమస్య అడిగిన వెంటనే పరిష్కారం చూపించడం వల్ల “దటీజ్ పవన్ కల్యాణ్” అనే నినాదం మరోసారి నిజమైంది. ఈ నిర్ణయంతో గ్రామ ప్రజలకు శాశ్వత ఉపశమనం లభించనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also read:అమేజింగ్‌గా మోగ్లీ కంటెంట్!

