కేసీఆర్ అంటే ఓ చరిత్ర..ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా చెరిగిపోని చిరునవ్వు ఆయన సొంతం .అందుకే సమైక్య పాలకుల కుట్రలు, ఎత్తులను చిత్తు చేస్తూ తెలంగాణ సాధించిన ధీరుడు కేసీఆర్. ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా నవ్వుతూ ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీని టచ్ చేసే ధైర్యం ఎవరూ చేయలేరు అనే సంకేతాలను కేడర్‌కు ఇస్తున్నారు.
ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా కేసీఆర్‌లో కనిపించిన ధైర్యం,ఆత్మవిశ్వాసం కార్యకర్తలకు వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. కేసీఆర్ ధైర్యమే తెలంగాణకు బలం..ఎవడేడ పోయినా పర్లేదు..మళ్ళీ మనం బలపడతాం..నిలబడతాం అని అంతా చెబుతున్న పరిస్థితి.
పార్టీ నుండి పోతుంది నాయకులే కార్యకర్తలు కాదు..ఎందరో దిగువ శ్రేణి కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన చరిత్ర మీది..సరే కొందరు తల్లిపాలు త్రాగి రొమ్ముగుద్దినా ఏం పర్లేదు తిరిగి అంతకు మించి వాళ్ళ తాత జేజమ్మ నాయకులను తయారు చేసే శక్తి మీ సొంతం అని చెబుతున్నారు. బలమైన డిల్లీ కోటలను కోటరీలను,లాబీయింగ్ లను బద్దలు కొట్టి తెలంగాణ తెచ్చిన ఘనత చరిత్ర మీ సొంతం అని గుర్తు చేస్తున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని… ఎత్తుపల్లాలు మీకు కొత్తకాదు..హేళనలలో వింతేం లేదు..పోరాటంలో వందలు వేల అవమానాలు చూసిన గుండె మీది..అవి దాటి తెలంగాణ సాదించి అఖండ కీర్తిని పొందిన ఘన చరుతులు మీరు అని చెబుతున్నారు. బీఆర్ఎస్ జర్నీలో జస్ట్ ఇదో స్పీడ్ బ్రేకర్ మాత్రమే..రెట్టించిన వేగంతో కారు దూసుకుపోతదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Chandrababu:కుప్పంలో విమానాశ్రయం నా కల