దటీజ్ ఎన్టీఆర్… ఇక ‘చిరు’ పరిస్థితేంటో?

52
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఫలానా హీరోకి అవార్డు వచ్చింది అంటే.. ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే వారు. కానీ, ఇప్పుడు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. అందుకే, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా అది గొప్ప విషయంగా అనిపించలేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవార్డుల పరిస్థితి అందుకు తగ్గట్టుగానే ఉంది. నిజానికి ఆ మధ్య జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయింపులోనే నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇక సాధారణ అవార్డుల గురించి ప్రత్యేక ముచ్చట్లు అనవసరం. కానీ, ఆస్కార్ అవార్డు అంటే అందరికీ గౌరవం ఉంది.

అందుకు ప్రధాన కారణం.. ఆస్కార్ లో పైరవీలు చేయలేరు. టాలెంట్ ఉంటేనే అవార్డు వస్తోంది. లేదు అంటే.. వాళ్లు ఇతర దేశాల సినిమాలను అస్సలు పట్టించుకోరు. అలాంటిది, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ఎన్టీఆర్ కు ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు దక్కింది. మొత్తం ఐదుగురు యాక్టర్లను తమ యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కి నేషనల్ అవార్డు రాకపోవచ్చు, లోకల్ మీడియాలో అద్భుతంగా తారక్ గురించి రాయకపోవచ్చు. నిజానికి ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిన సమయంలో చరణ్ ను ఆకాశానికి ఎత్తారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఉండి మరీ.. లోకల్ గా చరణ్ గురించి గొప్పగా రాసేలా పైరవీలు చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటూ వార్తలు కూడా రాయించారు. కానీ, చివరకు ఆస్కార్ తెర నిండా ఎన్టీఆర్ బొమ్మ పెట్టి మరీ ఆస్కార్ అవార్డును ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ను తమ యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఎన్టీఆర్ ప్రతిభకు ఆస్కార్ అయినా దాసోహం అనాల్సిందే.. దటీజ్ ఎన్టీఆర్. ఇంతకీ, చిరంజీవి ఎలా ఫీల్ అవుతున్నాడో పాపం.

Also Read:పోటీలో బాలయ్యే నెగ్గాడు

- Advertisement -