ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తహసీల్దార్ ఆఫీస్ ప్రాంగణం లో మొక్కలు నాటారు మారేడుపల్లి తహసీల్దార్ మాదవి రెడ్డి మరియు తహసీల్దార్ ఆఫీస్ బృందం…
ఈ సందర్భంగా తహసీల్దార్ మాదవి రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటలి అన్నారు.పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని చెప్పారు. గ్రీనరీ శాతం పెరగాలన్నా, వాతావరణం మానవ మనుగడకు అనుకూలంగా ఉండాలన్నా మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు . గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఒక ఉద్యమంలా ముందుకు సాగుతుంది అని ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమని కొనియాడారు.ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం తహసీల్దార్ ముషీరాబాద్, ట్రెస్సా యూనియన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి,సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పద్మ,అల్వల్ తహసీల్దార్ నాగమణి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.