అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో నటించిన ‘తంత్ర’ క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది.
‘రామాయణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేస్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నికుంబళ దేవి ఒక క్షుద్రదేవత. ఇంద్రజిత్తు తలపెట్టింది క్షుద్రపూజ’ అంటూ లక్ష్మణ్ మీసాల తాంత్రిక పూజల గురించే చెప్పే టెర్రిఫిక్ ఎపిసోడ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది.
ట్రైలర్ బినింగ్ లో కేవలం అనన్యకు మాత్రమే జుట్టు విరబూసుకుని బాత్ రూమ్ లో ఓ పాప కనిపించడం, తర్వాత వచ్చే తాంత్రిక విధానాల సీక్వెన్స్ లు ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. అనన్య, ధనుష్ మధ్య వున్న ప్రేమకథని కూడా చాలా నేచురల్ గా ప్రజెంట్ చేశారు. అనన్య, ధనుష్ పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా వుంది. సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.
దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తాంత్రిక విద్యలోని ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఇందులో చాలా గ్రిప్పింగ్ గా ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఇచ్చేలా రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కెమరాపనితనం, సౌండ్ డిజైన్, ఆర్ట్ వర్క్ అన్ని విభాగాలు అద్భుతమైన ఇంపాక్ట్ ని కలిగించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని కలిగించింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ‘తంత్ర’ ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం వుంది. వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్యకి బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. (నవ్వుతూ) సినిమా చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ తో వస్తున్నాం, విడుదల తర్వాత సినిమా పెద్ద సౌండ్ చేస్తుంది. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది. మార్చి 15న విడుదల కాబోతుంది. అందరూ తప్పకుండా చూడాలి. మా టీం అందరికీ థాంక్స్. ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.,
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క యాక్టర్ కి తంత్ర లాంటి సినిమా చాలా ముఖ్యం. ఇందులో చాలా కొత్త విషయాలు, ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. దర్శకుడు శ్రీనివాస్ గారు చాలా మంచి పెర్ఫర్మెన్స్ రాబట్టుకున్నారు. అనన్య బ్రిలియంట్ పెర్ఫార్మర్. ఈ సినిమాతో చాలా మంది నటీనటులతో కలసి పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో హారర్ తో పాటు రోమాన్స్ సెంటిమెంట్ అన్నీ వుంటాయి. మార్చి 15న తప్పకుండా సినిమా చూడండి” అని కోరారు.
Also Read:ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే !