GHMC ఎన్నికల్లో మద్దతు తెలిపిన సంఘాలకు ధన్యవాదాలు- కేటీఆర్

216
- Advertisement -

జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ కార్యాచరణ సమితికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మద్దతు తెలిపినందుకు తెలంగాణ అర్చక సమాఖ్య మరియు అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. ఉపేంద్రశర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ వర్గాలకి మంత్రి కే తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసునూరి బ్రహ్మానంద చారి, ప్రధాన కార్యదర్శి లాలుకోట వెంకటాచారికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ సంఘానికి ఐదు ఎకరాల భూమితో పాటు ఐదు కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

- Advertisement -