క‌రోనాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ప్రముఖ నటుడు..!

123
Jagapathi Babu
- Advertisement -

దేశంలో క‌రోనా మ‌రోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఎంతో మంది సినీ ప్రముఖులు దీని బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్‌లో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. ఇప్పటికే పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే అంతా కరోనాకు భయపడుతుంటే.. జగపతిబాబు మాత్రం కరోనాకు థ్యాంక్స్ చెబుతున్నారు. అసలు జగపతిబాబు కరోనాకు థ్యాంక్స్ చెప్పేందుకు గల కారణం ఏంటంటే..

షూటింగుల్లో పాల్గొనే స‌మ‌యంలో మేక‌ప్ వేయించుకోవ‌డం ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. అయితే, కరోనా వ‌ల్ల మేక‌ప్ మెన్ అందుబాటులో లేక‌పోవ‌డం, ఒకవేళ వారు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రు సినీ ప్ర‌ముఖులు క‌రోనా భ‌యంతో సొంతంగా మేక‌ప్ వేసుకుంటున్నారు ఈ జాబితాలో జగపతి బాబు కూడా ఉన్నారు. తాజాగా, ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న జగపతి బాబు త‌న మేక‌ప్ తానే వేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. క‌రోనాకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని దాని వల్లే తన‌కు తాను మేకప్ ‌మన్‌ అయ్యాన‌ని పేర్కొన్నారు.

- Advertisement -