- Advertisement -
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘థ్యాంక్యూ’? సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదని నా ఫ్రెండ్ చెప్పాడు..’’ అనే సూపర్బ్ డైలాగ్‌తో ఈ సినిమా కాన్సెప్ట్‌ను మనకు చెప్పకనే చెప్పేశారు. ఇక స్కూల్ డేస్ మొదలుకొని, కాలేజీ లైఫ్, ఆ తరువాత కెరీర్ లైఫ్ ఇలా హీరోకు ఎదురయ్యే పాత్రలు.. వాటిని అతడు అర్ధం చేసుకునే విధానం ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
- Advertisement -