“తంగలాన్” ప్రీ రిలీజ్

13
- Advertisement -

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైలాగ్ రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ – నేను విక్రమ్ గారికి పెద్ద అభిమానిని. ఆయనతో మా నాన్న వెన్నెలకంటి గారు వర్క్ చేశారు. మా బ్రదర్ శశాంక్ వెన్నెలకంటి విక్రమ్ గారి నాన్న సినిమాకు వర్క్ చేశారు. నేను ఈ సినిమాకు డైలాగ్స్ రాయడం సంతోషంగా ఉంది. విక్రమ్ గారి డెడికేషన్ అద్భుతం. “తంగలాన్” సినిమా నటుడిగా ఆయన అంకితభావాన్ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ఈ సినిమాతో హీరోయిన్ మాళవిక మోహనన్ ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. “తంగలాన్” సినిమాను థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిది. తప్పకుండా థియేటర్ లో ఆగస్టు 15న చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హాలీవుడ్ నటుడు డేనియల్ మాట్లాడుతూ – మా బ్రదర్ విక్రమ్, డైరెక్టర్ పా రంజిత్, మాళవిక, పార్వతీ వీళ్లంతా లేకుంటే “తంగలాన్” సినిమా జరిగేది కాదు. నన్ను ఈ మూవీలోకి తీసుకొచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు థ్యాంక్స్. “తంగలాన్” ఒక అమోజింగ్ మూవీ. అమోజింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. థియేటర్ లో తప్పుకుండా చూడండి. అన్నారు.

హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ – “తంగలాన్” సినిమాలో ఆరతి అనే క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు పా రంజిత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఇలాంటి ఒక గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది. నా టీమ్ అందరికీ విక్రమ్, జ్ఞానవేల్ రాజా, పార్వతీ, డేనియల్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 15న “తంగలాన్” సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – విక్రమ్ గారి సూపర్ హిట్ సినిమా అపరిచితుడు, కానీ ఆయన మనందరికీ సుపరిచితుడే. జ్ఞానవేల్ రాజా గారు కొద్ది రోజుల క్రితం తంగలాన్ 15 నిమిషాల ఫుటేజ్ చూపించారు. అది చూశాక ఈ సినిమా వేరే లెవల్ అనిపించింది. ప్రేక్షకుల్ని ఒక కొత్త అనుభూతికి లోనుచేస్తుంది. విక్రమ్ గారిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అభిమానిస్తారు. పా.రంజిత్ గారికి తెలుగులో అభిమానులు ఉన్నారు. వాళ్లంతా ఉదయం ఆటనే చూసేందుకు థియేటర్స్ కు వస్తారు. ఆయన మార్క్ తంగలాన్ లో మరోసారి కనిపిస్తోంది. జ్ఞానవేల్ రాజా గారు తన సినిమాలను సగర్వంగా సమర్పిస్తారు. ఆయన మరెన్నో తెలుగు మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. రాజా సాబ్ హీరోయిన్ మాళవిక ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. తంగలాన్ సినిమా ఈ టీమ్ అందరికీ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. అన్నారు.

Also Read:శ్రావణమాసం విశిష్టత..విశిష్ట పండగలివే

- Advertisement -