థమన్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్?

41
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘గుంటూరు కారం’. పక్కా మాస్ మసాలా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కావడంతో గుంటూరు కారం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ;రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి రెండు లిరికల్ సాంగ్స్, ఒక గ్లింప్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. గ్లింప్స్ పరవాలేదనిపించినప్పటికి రీసెంట్ గా విడుదలైన రెండు పాటలు అభిమానులను కొంత నిరాశ పరిచాయి. మొదట రిలీజ్ చేసిన ధమ్ మసాలా సాంగ్ యావరేజ్ గానే నిలిచింది.

ఇక రీసెంట్ గా విడుదల చేసిన ఓ మై బేబీ సాంగ్ పై కూడా అభిమానులు అసంతృప్తిగానే ఉన్నారు. అసలు మహేష్ బాబు రేంజ్ సాంగ్ కాదని, థమన్ పై సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు అభిమానులు. చాలా రొటీన్ గా ఉందని, మీడియం రేంజ్ హీరోల సాంగ్ మాదిరి ఉందని ఫైర్ అవుతున్నారు అభిమానులు. మహేష్ గత సినిమా సర్కారు వారి పాట మూవీ కి కూడా థమన్ సాంగ్స్ పై, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై అసహనం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు గుంటూరు కారం మూవీ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుండడంతో మహేష్ సినిమాలను థమన్ లైట్ తీసుకుంటున్నాడని అందుకే మంచి మ్యూజిక్ ఇవ్వడం లేదని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి మిగిలిన సాంగ్స్ అయిన అభిమానులను ఆకట్టుకుంటాయేమో చూడాలి.

Also Read:యూత్‌ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌..’ జోరుగా హుషారుగా’

- Advertisement -