విజయ్ 66 షురూ..

87
- Advertisement -

తమిళ సూపర్‌ స్టార్‌ తలపతి విజయ్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు, శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై భారీ బడ్జెట్ నిర్మించ‌నున్నారు. ఈ సినిమా నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.. ఇది విజయ్ కెరీర్‌లో 66వ సినిమా కాగా, ఇందులో రష్మిక మందన్న విజయ్‌ సరసన నటిస్తోంది.

ఈ రోజు చెన్నైలో నటీనటులు, సిబ్బంది పాల్గొనగా చిత్ర పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో విజయ్, హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త పూజతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ముందుగా పాటతో షూటింగ్ మొదలుపెట్టారు.

సక్సెస్ ఫుల్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం అంతే సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్ద‌బోతున్నారు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో విజయ్‌ని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి వంశీ పైడిపల్లి పవర్‌ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.

- Advertisement -