విజయ్ ‘విజిల్’ గట్టిగానే వేశాడు.. ట్రైలర్

733
vijay
- Advertisement -

తమిళ హీరో తళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’.ఈ సినిమాను తెలుగులో ‘విజిల్’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్​ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ‘విజిల్’ టీమ్ విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్ తండ్రికొడుకులుగా డబల్ రోల్ లో నటించినా.. మొత్తం మూడు విభిన్న గెటప్స్‌లో అభిమానులను మెస్మరైజ్ చేయనున్నాడు.

Thalapathy Vijay Whistle

 

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ ప్రారంభం నుంచే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. గ్రౌండ్ లో ఫుట్ బాల్ టీమ్ కోచ్‌గా బిగిల్‌లో పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇందులో మాస్ కు కిక్కిచ్చే సన్నివేశాలు సీన్స్ చాలానే ఉన్నాయి. విజయ్ యాటిట్యూడ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. అలాగే రాయప్ప పాత్రలో విజయ్ గోధుమ రంగు లుంగీని పైకి కట్టుకుంటూ నడిచే తీరు.. ఆ సమయంలోరెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.

ట్రైలర్ లో ఎక్కువగా ఇంప్రెస్ చేసే మరో అంశం ఫుట్ బాల్ ను నైపుణ్యంతో విజయ్ హ్యాండిల్ చేసే తీరు. ఓవరాల్ గా చూస్తే ఈ మాస్ మసాలా లాగా కనిపిస్తోంది. విజయ్ సినిమా కాబట్టి రిచ్ ఫీల్ ఉంది. బ్యాక్ రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -