విజయ్ పార్టీ పై భిన్నమైన అభిప్రాయాలు

37
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తూ కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుండగా ఆయన సీఎం అవుతారా ?, లేదా ? అనే దానిపై చర్చ మొదలైంది. అయితే, విజయ్ కి ఓటు వేయనని సీనియర్ హీరో అరవింద్ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాల్లో హీరో ప్రజలను కాపాడినట్టు.. నిజ జీవిత పాలిటిక్స్‌ లో చేయడం కుదరదని, దానికి అనుభవం ఉండాలన్నారు. మొత్తానికి విజయ్ పై అరవింద్ స్వామి చేసిన షాకింగ్ కామెంట్స్ ఫై విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

నిజానికి తమిళ స్టార్ హీరోగా విజయ్ దళపతికి ఫుల్ క్రేజ్ ఉంది. విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే, దీనిపై పలువురు సినీ ప్రముఖులు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విజయ్ రాజకీయాల్లోకి రావడంపై నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘విజయ్ సినిమాలో తనదైన ముద్ర వేసుకున్నారు. నటన ద్వారా ప్రజల మనసులు గెలిచారు. ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయం’ అని ఆమె అన్నారు. విజయ్‌పై.. రామ్ చరణ్ భార్య పాజిటివ్ కామెంట్స్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఐతే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం విజయ్ పై బాగా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలోనే హీరో విజయ్ పాదయాత్రకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా, అభిమాన సంఘం సభ్యులతో భేటీ అయిన విజయ పాదయాత్రపై నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ అనగానే విజయ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Also Read:ఆ జిల్లాల్లో వైసీపీ.. పనైపోయిందా?

- Advertisement -