స్థానిక సంస్థల ఎన్నికలకు దూరం:విజయ్

10
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడులో ఓ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు విజయ్.

ఈ మేరకు తమిళ వెట్రి కజగం పార్టీ తరపున లేఖ విడుదల చేశారు. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ తమిళ వెట్రి కజగం పార్టీ పోటీ చేయదని వెల్లడించారు. అలాగే తమిళనాడులో జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వట్లేదు అని తెలిపారు.

విజయ్ ప్రస్తుతం The GOAT సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సినిమాలు ఆపేసి పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయిస్తాడని సమాచారం.

Also Read:తిరుమలకు పోటెత్తిన భక్తులు..

- Advertisement -