- Advertisement -
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. కరోనాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అపత్కాలంలో ఎంతో మంది తమ వంతుగా సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. మహమ్మారి సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులకు అండగా నేనుంటాను అంటూ తాజాగా తమిళ హీరో విజయ్ మరోసారి ముందుకొచ్చారు.
విరుదాచలంలోని గవర్నమెంట్ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు, వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి అవసరమైన మాస్కులను పీపీఈ కిట్‌లను అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విజయ్ ఆదేశాలతో ఆయన మేనేజర్ బుస్సీ ఎన్.ఆనంద్ సలహా మేరకు కడలూరు జిల్లా నిర్వాహకుడు శీను, పలు విద్యార్థి విభాగాలు మంగళవారం నుంచి సేవల్లో నిమగ్నమయ్యారు. గతంలో కూడా విజయ్ కొవిడ్ బాధితులకు తన వంతు సాయం అందించిన సంగతి తెలిసిందే!
- Advertisement -