దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ప్రాజెక్ట్ నిన్న అధికారికంగా అనౌన్స్ చేశారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేరారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. “దళపతి67 వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా థ్రిల్‌గా వుంది’’ అన్నారు సంజయ్ దత్
ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా భాగం కానుంది. “దలపతి67లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉంది. ఇటువంటి అద్భుతమైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను! ” అన్నారు ప్రియా ఆనంద్.
కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.. ‘దళపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు.
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఎన్. సతీస్ కుమార ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఇవి కూడా చదవండి…