మీకంటే ఇంకెవరు బాగా చూపించగలరు

97
- Advertisement -

కాంతార సినిమాపై తాజాగా తలైవా స్పందించారు. మీ కంటే ఇంకెవరు బాగా చూపించగలరని ప్రశంసించారు. శాండల్‌వుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన కాంతార… భారతదేశమంతటా పాన్‌ ఇండియా సినిమాగా ఎదిగిన సంగతి తెలిసిందే. తెలిసిన దానికంటే తెలియంది ఎక్కువ…ఈ విషయాన్ని సినిమాల్లో మీ కంటే బాగా ఎవరూ చెప్పలేరని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ని పొగిడారు.

కాంతార సినిమా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిందని భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అదొక మాస్టర్‌ పీస్‌ అని అభివర్ణించారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా రిషబ్‌ శెట్టి తన ప్రతిభను చూపెట్టినందుకు హ్యాట్సాఫ్‌ అని అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు.

దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో విస్తరించిన తుళునాడులోని భూతకోల ఆచారాలను ఆధారంగా చేసుకొని రిషబ్‌ శెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాను పలు భాషల్లో డబ్‌ చేసిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్‌ వారు రూ.16కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా రూ.200కోట్ల వసూళ్లు సాధించిందని శాండల్‌వుడ్‌ టాక్.

ఇది కూడా చదవండి…

కాంతారపై పూజా హెగ్డే ప్రశంసలు

కాంతార సినిమాపై ఫిర్యాదు..నిజమేంత?

2023లో సర్దార్‌-2

 

- Advertisement -