అంచనాలకు తగినట్లుగా థాకరే ట్రైలర్‌..

233
Thackeray trailer
- Advertisement -

శివసేన పార్టీ వ్యవస్థాపకుడు,వివాదాస్పద రాజకీయ నేత బాల్‌ ఠాక్రే జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘ఠాక్రే’ అనే టైటిల్‌ను పెట్టారు. అభిజీత్‌ పాన్సే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రీల్ లైఫ్‌ ఠాక్రే పాత్రలో నవాజుద్దిన్‌ సిద్ధిఖి నటించారు. అతని భార్య మీనా తాయ్ థాకరేగా అమృతా రావ్ నటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. బాల్ థాకరే తనయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సమక్షంలో విడుదల చేశారు.

Thackeray

మహారాష్ట్ర అల్లకల్లోలంగా మారిపోయిన సీన్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఈ గొడవల నుంచి ముంబైని కాపాడేది ఒక్కడే అన్న వాయిస్ ఓవర్ తర్వాత నవాజ్ ఎంట్రీని చూపించారు. పాకిస్థాన్‌కు బద్ధ వ్యతిరేకి, హిందుత్వ వాది, మహారాష్ట్ర మరాఠీలదే అని నినదించిన అత్యంత శక్తివంతుడైన బాల్ థాకరే క్యారెక్టర్‌ను అదే స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు. అంచనాలకు తగినట్లే థాకరే క్యారెక్టర్‌లో నవాజ్ జీవించేశాడు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ఓ సీన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించడం విశేషం. ఈ ట్రైలర్ రిలీజ్‌కు ముందే సెన్సార్ బోర్డు ఇందులోని నాలుగు డైలాగులు, రెండు సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నామని దర్శకనిర్మతలు తెలిపారు. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -