బాలీవుడ్‌లో ముందు క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారి కథలతో వరస పెట్టి సినిమాలు తీసిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు మిగిలిన రంగాలపైనా దృష్టి పెట్టారు. తాజాగా హిందూత్వవాది అయిన శివసేన పార్టీ వ్యవస్థాపకుడు అయిన బాల్ థాక్రే జీవితంపైనా సినిమా చేస్తున్నారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ఈ సినిమాకు కథ అందించగా, అభిజిత్ పాన్సే దర్శకత్వం వహిస్తున్నాడు.
శివసేన నాయకుడు బాల్ థాక్రే జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న ‘థాక్రే’ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో బాల్ థాక్రే పాత్రను విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషిస్తున్నారు. బాల్ థాక్రే బలమైన శివసేన నాయకుడుగా ఎలా మారాడనే అంశాలను ఇందులో చూపించనున్నారు. దాదాపు రెండు నిమిషాల వ్యవధి ఉన్న ఈ టీజర్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీని చూస్తే థాక్రే పాత్రలో ఒదిగిపోయినట్లుగా అనిపిస్తోంది.
భజరంగీ భాయిజాన్, రయీస్, బద్లాపూర్, లయన్ వంటి మూవీస్ తో పాటు ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. థాక్రే పాత్రలో నటిస్తుండటం గర్వంగా భావిస్తున్నట్లు నవాజుద్దీన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్ధవ్ థాక్రేకి కృతజ్ఞతలు తెలియజేశారు. హిందీ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లిషులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 2019, జనవరి 23న ఈ చిత్రం విడుదలకానుంది.
https://youtu.be/wpUwdr4IRvs