సచివాలయం ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపు

7
- Advertisement -

ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చి విస్మరించింది అన్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మెన్ థామస్ రెడ్డి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టీ హామీలు నెరవేర్చలేదు..గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆర్టీసీ విలీనం పై మాట మార్చింది అన్నారు.

ఎలెక్ట్రిక్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇవ్వాలి… ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడుతారు అన్నారు. మహాలక్ష్మి బకాయిలు కూడా పూర్తిగా చెల్లించడం లేదు అన్నారు.

ఆర్టీసీ దాదాపు 2వేల 300 కోట్లు నష్టాల్లో ఉంది… ఇవన్ని పూర్తి చేయాలి అన్నారు. మా పోరాటం కొనసాగుతుంది…రేపు ఉద్యోగులు భారీగా సచివాలయం ముట్టడికి రావాలి..ఇది మా ఆకలి పోరాటం అన్నారు.

Also Read:ఎక్స్ ట్రార్డినరీగా ‘సరస్వతి’!

- Advertisement -