తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

5
- Advertisement -

ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్‌ ఇచ్చాయి. 21 డిమాండ్లతో నోటీసు ఇచ్చారు ఆర్టీసీ యూనియన్‌ నేతలు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీస్‌ ఇచ్చారు.

అలాగే పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా..ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. గత శుక్ర, శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

Also Read:బీఆర్ఎస్ రైతు మహాధర్నా..

- Advertisement -