- Advertisement -
తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. రక్షాబంధన్ నాడు రికార్డు స్థాయిలో 63 లక్షల మంది వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది టీజీఎస్ఆర్టీసీ . రాఖీ పండుగ రోజు టీజీఎస్ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయని ఛైర్మన్ సజ్జనార్ తెలిపారు. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం నాడు 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయన్నారు.
రాఖీ నాడు రికార్డు స్థాయిలో 32 కోట్ల వరకు రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని సజ్జనార్ వెల్లడించారు.
- Advertisement -