- Advertisement -
ప్రయాణీకులకు షాకిచ్చింది ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్‌పాస్ ఛార్జీలు పెరిగాయి. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ పాస్ ధరలను పెంచింది. పెంచిన బస్ పాస్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లు పెరిగాయి. రూ. 1150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర రూ. 1400కు పెంచగా రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ రూ. 1800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను పెంచారు.
మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించి, మగాళ్లపై ఛార్జీల బాదుడు ఏంటని పలువురు మండిపడుతున్నారు.
Also Read:రాజకీయాల కోసం నీటి హక్కులను కాలరాయొద్దు
- Advertisement -

