తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైర్న మోగనుందా.. నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ సాయంత్రం తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి.
కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. గత శుక్ర, శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసులను ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమయ్యింది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:రవితేజ.. ‘మాస్ జాతర’