గ్రూప్–1 కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయనుంది టీజీపీఎస్సీ కమిషన్.
ఈరోజు న్యాయ నిపుణులు, ప్రభుత్వంతో సమావేశం అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలనే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది.
గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పాత్రలను రీవాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.8 నెలల్లో మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని TGPSC ని ఆదేశించింది హైకోర్టు. లేనిపక్షంలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని న్యాయస్థానం తెలిపింది. మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేశారు కొందరు అభ్యర్థులు. దీంతో మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసింది హైకోర్టు.
Also Read:సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం..సీఐడీ కేసు!

