ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి: టీజీవో నేతలు

3
- Advertisement -

ఓయూ ఈసీఈ ఆడిటోరియంలో టీజీవో అసోసియేషన్ (TGO ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. TGO రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరుగగా రాష్ట్ర ప్రభుత్వం పై టీజీవో ఉద్యోగుల అసహనం వ్యక్తం చేసింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్సు, డీఏలు, హెల్త్ కార్డులు, పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదు అని.. ప్రభుత్వ పట్టించుకోక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరిద్దరించాలన్నారు ఏలూరి శ్రీనివాసరావు.

ఉద్యోగులకు వెంటనే రెండవ పీఆర్సీ అమలు చేయాలని.. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను సర్వీస్ ను పొడిగించవద్దు అన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల కు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని.. హెచ్.ఓ.డి. ఉద్యోగులను 12 .5 % కోటను పునరుద్ధరించి సెక్రటేరియట్ లోకి తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఉద్యోగులను చర్చలకు పిలిచి మాట్లాడాలన్నారు.

మార్చి 12న విస్తృత స్థాయి సమావేశం ఉంది.. ఆలోపు ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు.

Also Read:తెలంగాణలో తగ్గిన రేషన్ కార్డులు: కేటీఆర్

- Advertisement -