కిడ్నాప్ కేసులో ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, కేసులో మోహన్‌బాబు పాత్రకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడం సబబు కాదని వాదించారు.
మరోవైపు, పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ఆరోపణలు అసత్యమని, రాజకీయ ప్రేరణతో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అయితే బాధితుడి వాదనలు వినకుండా ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రెండు పక్షాల వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. తదుపరి విచారణలో బాధితుడి వాదనలు, దర్యాప్తు పురోగతిపై కోర్టు మరింత స్పష్టత కోరే అవకాశముంది. హైకోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి రాజకీయ, సినీ వర్గాల్లో నెలకొంది.
Also Read:కెనడాలో కాల్పుల కలకలం..

