ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది? ..పేదల ఇండ్లు కూల్చడంలో చూపించిన అత్యుత్సాహం చెరువులు ఆక్రమించి కడుతుంటే కనపడట్లేదా! అంటూ హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఓ న్యాయవాది. ఈ పిటిషన్ విచారిస్తూ పేదల ఇళ్ల మీదకి ఎలాంటి నిబంధనలు లేకుండా వెళ్లే హైడ్రాకు ఒవైసీ కాలేజీ పట్ల వివక్ష ఎందుకని నిలదీశారు న్యాయమూర్తి.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్థారణకు రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా, ఎన్ని ఏళ్లు ఏం చేశారని, ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై నివేదిక తయారు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఒవైసీ విద్యాసంస్థలో చదువుతున్న వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి మార్చాలని, బయటికి వెళ్లాలనుకునే వారికి ఒవైసీ కాలేజీ యాజమాన్యం సహకరించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
Also Read:‘భోగి’ సులోచన రాణిగా అనుపమ!

