హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఇల్లు కూల్చేస్తారా?

5
- Advertisement -

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్ అయింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో మున్సిపాలిటీ, హైడ్రా అధికారులు తన ఇంటిని అక్రమంగా కూల్చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని హైకోర్టును ఆశ్రయించారు ఓ వ్యక్తి.

సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఈ ఏడాది మార్చిలో అధికారులకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. జూన్ 30వ తేదీనా 70 మంది పోలీసులతో వచ్చి, కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి, తనను అరెస్టు చేసి, కుటుంబ సభ్యులను ఇంటి నుండి బయటకు పంపించి మరీ తన ఇంటిని కూల్చేశారని హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్.

దీంతో కోర్టు ఆదేశాలు అంటే లెక్కలేదా అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ సంఘటనపై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తూ, ఈ నెల 22వ తేదీకి కేసును వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.

Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

- Advertisement -