దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

5
- Advertisement -

దావోస్‌లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 19న మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ లో పర్యటించనున్నారు. 20 నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొననుంది రేవంత్ బృందం.

అనంతరం 24న దావోస్ నుంచి యూఎస్‌కు రేవంత్ బృందం వెళ్లనుంది. ఫిబ్రవరి 1న రాష్ట్రానికి తిరిగిరానున్నారు రేవంత్ రెడ్డి. అంతకుముందు ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్మల్, మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో రేవంత్ పర్యటనలు ఉండనున్నాయి.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సీఎం. 18న రాత్రి మేడారంలో సీఎం రేవంత్, మంత్రులు బస చేయనున్నారు.

Also Read:శ్రేయాస్‌ను ఇమిటేట్ చేసిన విరాట్!

- Advertisement -