తెలంగాణ బడ్జెట్ 2025-26..హైలైట్స్

14
- Advertisement -

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లలో 1000 బిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు.. రాబోయే పదేళ్ల కాలంలో దీనిని ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్ (ట్రిలియన్ డాలర్) వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుందన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత క్రింద పింఛన్ల పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్ధవంతంగా అమలు చేస్తోందని చెప్పారు.

తెలంగాణ బడ్జెట్ 2025-26

₹3,04,965 కోట్లు – మొత్తం వ్యయం
₹2,26,982 కోట్లు – రెవెన్యూ వ్యయం
₹36,504 కోట్లు – మూలధన వ్యయం

కేటాయింపులు

()హోం శాఖ – రూ. 10,188 కోట్లు
()పొరసరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
() విద్యాశాఖకు – రూ.28, 108 కోట్లు
()వ్యవసాయ శాఖ – రూ. 24,439 కోట్లు
()యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు – రూ.11,600 కోట్లు
()పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ – రూ. 31,605 కోట్లు
()మహిళా సంక్షేమ శాఖ – రూ.2862 కోట్లు
()రైతు భరోసా పథకానికి – రూ.18 వేల కోట్లు
()షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి – రూ.40,232 కోట్లు
()షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి – రూ.17,169 కోట్లు
()బీసీ సంక్షేమ శాఖ – రూ.11, 405 కోట్లు
()చేనేత రంగానికి – రూ.371 కోట్లు
()మైనారిటీ సంక్షేమానికి – రూ. 3.591 కోట్లు
()పరిశ్రమల శాఖ- రూ.3527 కోట్లు
()ఐటీ శాఖ – రూ.774 కోట్లు

Also Read:TG Budget 2025-26: కేటాయింపులు ఇవే

()విద్యుత్ శాఖ – రూ.21.221 కోట్లు
()వైద్యారోగ్య శాఖ – రూ.12, 393 కోట్లు
()మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ – రూ.17,677 కోట్లు
()ఇరిగేషన్ శాఖ – 27, 373 కోట్లు
()రోడ్డు, భవనాల శాఖ – రూ.5907 కోట్లు
()టూరిజం శాఖ – రూ.775 కోట్లు
()క్రీడా శాఖ – రూ.465 కోట్లు
()పర్యావరణ శాఖ – రూ.1023 కోట్లు
() పౌర సరఫరాలు- రూ.5,734 కోట్లు
()పరిశ్రమలు -రూ.3,527 కోట్లు – పరిశ్రమలు
()మహిళలు , శిశు సంక్షేమం -రూ.2,862 కోట్లు
()పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
()యువజన సేవలు -రూ.900 కోట్లు
()టూరిజం- రూ.775 కోట్లు
()సమాచారం, సాంకేతికత- రూ.774 కోట్లు

()6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు

()మహాలక్ష్మి పథకానికి – రూ.4,305 కోట్లు

()గృహజ్యోతి పథకానికి – రూ.2,080 కోట్లు

()సన్న బియ్యం బోనస్‌కు – రూ.1800 కోట్లు

()రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి – రూ.1,143 కోట్లు

()గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి – రూ.723 కోట్లు

()ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు – రూ.600 కోట్లు

- Advertisement -