దసరాకి టీఎఫ్‌సీసీ నంది అవార్డులు..

70
- Advertisement -

తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ మ‌రియు సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో నంది అవార్డులు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూడా భాగ‌స్వామ్యం చేసేందుకు గాను ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర టూరిజం మ‌రియు ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ను టీఎఫ్‌సీసీ స‌భ్యులు క‌ల‌వ‌డం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. `తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ కు మ‌రియు సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు నంది అవార్డులు అంద‌జేయాల‌ని టూరిజం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ గారిని క‌ల‌వ‌డం జ‌రిగింది. టీఎఫ్‌సీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న నంది అవార్డుల కార్య‌క్ర‌మానికి పూర్తి స‌పోర్ట్ ఉంటుంద‌ని మంత్రిగారు హామీ ఇవ్వ‌డం జ‌రిగింది. ముందుగా వ‌చ్చే ఉగాది పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని వివిధ టీవీ ఛానెల్స్‌లో ప్రసార‌మైన సీరియ‌ల్స్ కు నంది అవార్డులు అంద‌జేయ‌డం జ‌రుగుతుంది.

అదే విధంగా ద‌స‌రా పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని 2021 – 2022 సంవ‌త్స‌రంలో సౌత్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన చిత్రాల‌కు నంది అవార్డులు అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యంతో టీఎఫ్‌సీసీ ఈ నంది అవార్డుల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం చాలా ఆనందంగా ఉంది. సీరియ‌ల్స్ మ‌రియు చిత్రాల‌కు సంబంధించి 24 క్రాప్ట్స్ సంబంధించి టెక్నీషియ‌న్స్ మ‌రియు ఉత్త‌మ డైరెక్ట‌ర్లు మ‌రియు ఉత్త‌మ ఆర్టిస్టులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. వివిధ కేట‌గిరీల‌కు సంబంధించి గోల్డ్, సిల్వ‌ర్ మ‌రియు బ్రాస్ అవార్డులు ఉంటాయి. ఈ చిత్రాల ఎంపిక జ్యూరీ స‌భ్యుల నిర్ణ‌యం మేర‌కు ఉంటుంది. ముఖ్యంగా అమితాబచ్చన్ గారికి, ర‌జ‌నీకాంత్ గారికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఇవ్వాల‌ని క‌మిటీ స‌భ్యుల‌ము నిర్ణ‌యం తీసుకున్నాము. మేము నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని నిర్మాత‌లు, ఆర్టిస్టులు మ‌రియు ఇత‌ర ప్ర‌ముఖులు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి పూర్తి స‌హ‌కారం అందిస్తున్న మంత్రి శ్రీ‌నినివాస్ గౌడ్ గారికి ధ‌న్య‌వాద‌ములు` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎఫ్‌సీసీ స‌భ్యులు గురు రాజ్, నెహ్రూ, నాసగోని రాజయ్య గౌడ్, డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్ , శ్రీశైలం, వహీద్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -