పదేళ్ల తర్వాత పాక్‌లో

728
pak test cricket
- Advertisement -

పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఇప్పటివరకు యూఏఈ వేదికగా టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న పాక్‌..ఆ దేశ అభిమానులకు గడ్ న్యూస్ ఇది. పాక్‌లో పర్యటించి టెస్టు సిరీస్‌ ఆడేందుకు అంగీకరించింది శ్రీలంక.

2009లో పాక్‌లో పర్యటించింది శ్రీలంక. లాహెర్‌లో శ్రీలంక ఆటగాళ్లు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ తర్వాత పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం ముందుకురాలేదు. దీంతో పాక్ క్రికెట్ ఆడేందుకు యూఏఈని తటస్థవేదికగా చేసుకుంది.

రావల్పిండి వేదికగా డిసెంబరు 11 నుంచి 15 వరకూ తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 19 నుంచి 23 వరకూ కరాచీ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టూర్‌ని విజయవంతంగా ముగించి పాక్‌లో క్రికెట్‌కి పూర్వవైభవం తీసుకురావాలని పీసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తోంది పీసీబీ.

- Advertisement -