క్లాత్ మాస్కులు వాడితే బెటర్- టెస్కో ఎండీ

570
Sailaja Ramayyar
- Advertisement -

ప్రొడక్షన్ కావాలి అంటే లాక్ డౌన్ అయిపోవాలి. మా దగ్గర ఉన్న బట్టతో మాస్క్ లు తయ్యార్ చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో సర్జికల్ మాస్క్ లు మెడికల్,పారా మెడికల్ స్టాఫ్ వాడుతున్నారు కాబట్టి మనం క్లాత్ మాస్క్ లు వాడితే బెటర్ అన్నారు టెస్కో ఎండి శైలజ రామయ్యర్. ఇప్పుడు మేము క్లాత్ మాస్క్ లు తయ్యార్ చేస్తున్నాం. 2 లక్షల మాస్క్ లు తయ్యారు చేయడానికి ఆర్డర్లు ఇచ్చాము. ఇంకా కావాలి అంటే కూడా ఇస్తామన్నారు.

హైదరాబాద్ నగరం నలుమూలల ఈ మాస్క్ లను స్టిచ్ చేయిస్తున్నాం.ఈ మాస్క్ ల తయారీ హ్యాండ్లూమ్, పవర్ లూం క్లాత్ తో తయ్యార్ చేయిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో 100 కంటే ఎక్కువ మాస్క్ లు ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ చేస్తాం.ఈ నెంబర్ కు 8143756556 పోన్ చేస్తే హోమ్ డెలివరీ చేస్తాం. యాదాద్రి జిల్లాలో కలెక్టర్ 10 వేల మాస్క్ లు తయ్యార్ చేయించారు. రతన్ దీప్ సూపర్ మార్కెట్ లలో కూడా ఈ మాస్క్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లాత్ మాస్క్ లు 20 రూపాయలు,40 రూపాయలకు అమ్ముతున్నామని టెస్కో ఎండి తెలిపారు.

లాక్ డౌన్ లో సడలింపు ఉంటే వచ్చే బతుకమ్మ పండుగ లోపు అక్టోబర్ వరకు చీరెలు పూర్తి చేస్తాం,225 రకాల చిరలతో 90 లక్షల బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చాము. ఇప్పటివరకు బతుకమ్మ చీరెలు 40 శాతం ప్రొడక్షన్ అయింది.లాక్ డౌన్ ఎత్తివేస్తే 5 నెలల సమయం పడుతుంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరంకు 24 లక్షల విద్యార్థులకు 80 కోట్ల రూపాయల ఆర్డర్ టెస్కో కు వచ్చిందని ఆమె అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు సంబంధించి యూనిఫాం తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ లాక్ డౌన్ నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతుంది.మే 7 తేదీ తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తే 2,3 నెలల సమయం పడుతుంది. ప్రభుత్వం వెలిఫెర్ పాఠశాలలకు 70 కోట్ల ఆర్డర్ వచ్చింది. లాక్ డౌన్ వలన పనులు ఆగిపోయాయి.లాక్ డౌన్‌లో చేనేత రంగానికి వెసులుబాటు ఉంటే యధావిధిగా కోనసాగుతాయని టెస్కో ఎండి శైలజ రామయ్యర్ అన్నారు.

- Advertisement -